ఓ నేస్తమా!
నేను రాసిన లేఖను చూసి ఆశ్చర్య పోతున్నావా?
నేను రాసిన లేఖలొ నీకు ఒక ప్రేమికుడు కనిపిస్తే ఆ ప్రేమకు కారణం నువ్వే..
నేను రాసిన లేఖలొ నీకు ఒక కవి కనిపిస్తే ఆ కవిత అందానివి నువ్వే..
నేను రాసిన లేఖ నీ పెదవులచేత చదవబడితే నా ప్రేమ సార్ధకం..
నేను రాసిన లేఖ నీ మనసులొ నాకు స్థానన్ని కలిగించగలిగితే నా కవిత సార్ధకం..
రమేష్...
చెలియా!
స్వేద తీర్చుకోవడానికే నువ్వు నాపై వాలితే,
ఆ గగనమే నింగిపై అశతో తలవాల్చినట్లుగా..
ఆమని కాలంలో మైమరచి నెమలి ఆడినట్లుగా..
అదే సమయంలో నాకనులలోఆనందానికి కాంతులు చిన్నపోయినట్లుగా...
నా మది ఎంతగ ఆలోచించుచున్నదో...
రమేష్..
...........See My Blog In "XP" System and Refresh 2 times............
చెలియా!
కలువ పువ్వులవంటి కన్నులతో నన్ను కవ్వించి,
అదే కలువలలో ఉండే మకరందం నాపై కురిపించి,
కాలం అనె విధిఒదిలో చేరి నాకు దూరమై పోతావా!
నీవు నాచెంతలేనిదే నామనసుకు ప్రాణముండదు,
అదె మనసులో నీపై వ్రాయుటకు భావాలుండవు.
నీమాటలతో నా మనసుకు ప్రాణం పోసి,
నీ మార్గన్ని ఈ జన్మకు నాకు తోడుగా మలచమని కోరే..
రమేష్...
మధువులొలికె మాటలతో సొగసులొలికే నా ప్రాణమా!
భ్రుందావనంలో పువ్వువై నన్నుకవ్వించే ఆసుందరివి నువ్వే..
ఎడారిలొ ఎండమామిలా కరుణించుమా సుకుమారి..
తేనెలాంటి తియ్యదనం నీపెదవులలో దాచినదాన..
నీ మాటలతొ నన్ను బంధించినావే!
నీవే గగనానివైతే నేను కెరటన్నై ఎగసిపడి నీ ఒడిలో చేరనా.... రమేష్...
నా నేస్తమా...
నా కలను నిజం చేసింది నువ్వే,
కాని అదే కలగా మిగిలి పోయింది నువ్వే..
నీ మాటలు వినక నా కర్ణములు మూగబోయినాయి.
నిన్ను చేరె దారే తెలియక నా కనులు కలత చెందినాయి.
నీ మాట కోసం ఎదురు చూసే నా మది ఆశ తీర్చవా...
రమేష్..
ఓ నేస్తమా...!
కనులు,
కురులు.
సొగసు,
మనసు.
రూపం,
రమణీయం.. కవి కవితకు మూలం అయితే
నేను రాసే కవితకు మూలం "నువ్వు" అనే పదం..
రమేష్..