му ѕiιєη¢є ѕρєαкѕ αισт....

Wednesday, March 5

My promice....


ఓ చెలి!
నేను నీజాడకోసం వెతుకుతున్నాను...
జాడ తెలిసిన వెంటనే,
సముద్రంలో కెరటాన్నై,
కెరటంలోని ఆనందాన్నై,
ఆ ఆనందంలో ఉండే ప్రేమనై,
అదే ప్రేమ నిండి ఉండే మనిషినై,
మనిషిలాగ ఉన్న ప్రేమికుడ్నై,
నీ చెంత చేరి నీడలాగ ఉండి జీతాంతం తోడు ఉంటానని మాట ఇస్తూ...
నీ రమేష్...

Naa Mounam.....

ఓ చెలి!
నేను నీ చెలిమికై పరితపిస్తున్నాను,
కాని దానికి అర్హుడునా! అని ఆలోచిస్తున్నాను.
నేను నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను,
కాని ధైర్యంలేక ఆగిపోతున్నాను.
నేను నీ దారివెంట పయనించాలని అనుకున్నాను,
కాని నిన్ను చేరె దారే తెలియక తపన పడుతున్నాను.
నీచెలిమికై పరితపిస్తున్న నాపయనానికి దారిచూపి ఒక దరికి చేరుస్తావని ఆశిస్తూ..
నీ నేస్తం.. (రమేష్)

Sunday, January 27

నా జీవితం....


ఓ నేస్తమా!
నా మనసుకు మక్కువైన నీ మాటలను,
నాకన్నులు కోరుకునే నీ రూపమును,
నా పెదవులు ప్రతిక్షణం జపించె నీ నామమును,
ప్రతి దినము నా దినచర్యగా కావాలని నేను కోరుకున్నాను.
అయితే నీ జీవితంలో దానికి అర్హతలేదని వెళ్ళిపోయావు,
కాని నువ్వు పలికే తొలిమాటలోనే నా జీవితం ఉందని గ్రహించినప్పుడే అది చిగురించడం ప్రారంభం అవుతుంది.
రమేష్...

Feedback or Contact me.